telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

యూట్యూబర్ హెరాల్డ్ .. చాయ్ విత్ బార్బర్..బహుమతిగా 400డాలర్లు..

you tuber herald gifted 400 dollars to barber

యూట్యూబర్ గా హెరాల్డ్ చాలా మందికి సుపరిచితుడే. దేశవిదేశాల తిరుగుతూ అనేక వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. అలాగే ఇండియా కి కూడా వచ్చాడు. ఓ రోజు అహ్మదాబాద్‌లో ఆరు బయట ఒక వీధిలో ఉన్న సెలూన్ వద్దకు వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. తొందరగా ట్రిమ్ చేయమని చెప్పి, తన యూట్యూబ్ చానెల్ కోసం అనుమతి తీసుకొని దాన్ని మొత్తం చిత్రీకరించాడు. ‘ఈ వ్యాపారం గురించి తెలుసుకోవడం చాలా బాగా అనిపించింది. ఈ వ్యాపారం ఎలా సాగుతుంది, రోజుకు ఎంతమంది కస్టమర్లు వస్తారు, అలాగే పేవ్‌మెంట్ మీద వ్యాపారాన్ని నిర్వహించడానికి ఎవరికైనా డబ్బు చెల్లించాలా’ అని పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే కటింగ్ అయిన తరవాత సెలూన్‌ నడిపే వ్యక్తితో కలిసి సెల్ఫీలు కూడా దిగాడు. అతడు చేసిన పనికి ఎక్కువ మొత్తం తీసుకుంటాడేమోనని భావించాడు.

కానీ, ఆ హెయిర్‌డ్రెస్సర్‌ కేవలం రూ.20 మాత్రమే అడిగాడు. దానితో ఆశ్చర్యపోయిన హెరాల్డ్ ..’ఇదే అసలు నిజాయతీ. అతడు నన్ను రూ.20 మాత్రమే అడిగాడు. అతడు ఎక్కువ అడిగితే కోపం వచ్చేదేమో’ అని వెల్లడించాడు. వెంటనే అతడి జేబులో నుంచి 400 డాలర్లు(రూ.28,000) తీసి సదరు వ్యాపారికి ఇచ్చాడు. ‘నేను ప్రయాణంలో కలిసిన మంచి వ్యక్తికి అదనంగా బహుమతి ఇచ్చాను ‘ అని మెచ్చుకున్నాడు. ఆ డబ్బుతో ఏదైనా పరికరం కొనుక్కోమని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమని సూచించాడు. ఆ డబ్బు తీసుకొన్న హెయిర్ డ్రెస్సర్‌ హెరాల్డ్ కు ఓ కప్పు కాఫీ కొనిచ్చి, తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Related posts