telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాలయ్యను మళ్ళీ రాయలసీమ తీసుకపోనున్న గోపీచంద్…

సరైన హిట్ లేకుండా డౌన్ లో ఉన్న రవితేజ కు ఈ సంక్రాంతికి క్రాక్ సినిమాతో భారీ హిట్ అందించి తాను అందుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. వాటిలో నందమూరి బాలకృష్ణ గారితో కూడా అవకాశం లభించింది. అయితే వెంటనే బాలయ్యతో సినిమా చేసేందుకు గోపీచంద్ సిద్దమయ్యారు. ప్రస్తుతం గోపీ తను బాలయ్యతో చేయనున్న సినిమాకు కథను సిద్దం చేస్తున్నారు. అయితే వీరి కాంబో కోసం గోపీ అద్భుత ప్లాట్‌ను ఎంచుకున్నారంట. ప్రస్తుతం ఈ సినిమాలో బాలయ్య ఎలా కనిపిస్తారన్న వార్త హాట్ టాపిక్‌గా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా కథ బ్యాక్ డ్రాప్ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథను గోపీ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే బాలకృష్ణ చాలా కాలం తరువాత ఫ్యాక్షన్ సినిమాలో చేయనున్నారు. ఈ సినిమాను కూడా నిజ సంఘటనల ఆధారంగానే రెడీ చేయనున్నారంట. ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది. 

Related posts