telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు : రెండు చోట్ల టీఆర్‌ఎస్‌ ఆధిక్యం

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్న ఉదయం 8 గంటల ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు నల్గొండ-వరంగల్‌-ఖమ్మం నియోజకవర్గం తొలి రౌండ్‌ ఫలితాలు రిలీజ్‌ అయ్యాయి. ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గ తొలి రౌండ్‌ ఫలితాలను ప్రకటించారు. అయితే.. రెండు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లీడ్‌లో ఉండటం గమనార్హం. హైదరాబాద్‌ సెగ్మెంట్‌ పరిధి తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణిదేవికి 17429 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌ రావు రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 16385 ఓట్లు పోలయ్యాయి. తొలి రౌండ్‌లో వాణీదేవీ 1044 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావు నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయనకు 8357 ఓట్లు పోలయ్యాయి. అటు నల్గొండ సెగ్మెంట్‌ పరిధిలో ఉదయం తొలి రౌండ్లో మొత్తం 56003 ఓట్లు లెక్కించారు. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16130 ఓట్లు పడ్డాయి. రెండో స్థానంలో తీన్మార్‌ మల్లన్న నిలిచారు. ఆయనకు 12046 ఓట్లు పోలయ్యాయి. ఇక ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు రావడానికి మరింత సమయం పట్టనుంది. ప్రస్తుతం కౌంటింగ్‌ విశ్రాంతి లేకుండా కొనసాగుతోంది.

Related posts