telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు…

corona vaccine India

తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజాగా ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 1,445 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,38,632కు చేరింది. ఇప్పటి వరకు 2,18,887 మంది రికవరీ అయ్యారు… మృతుల సంఖ్య 1,336కు చేరింది. కరోనా మృతుల సంఖ్య దేశంలో 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.56 శాతంగా ఉందని.. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 91.3 శాతంగా ఉంటే… రాష్ట్రంలో 91.72 శాతానికి పెరిగిందని ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్రంలో 18,409 యాక్టివ్ కేసులు ఉండగా… ఇందులో 15,439 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా  జీహెచ్‌ఎంసీ పరిధిలో 286 కేసులు నమోదు కాగా.. మేడ్చల్‌ 122, రంగారెడ్డి జిల్లా 107, నల్గొండలో 102 కేసులు నమోదు అయ్యాయి.

Related posts