మహారాష్ట్రలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఈ మహమ్మారి బారినపడుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 20 వేల మందికిపైగా పోలీసులు కరోనా బారినపడినట్టు అధికారులు నిన్న వెల్లడించారు. గత 24 గంటల్లోనే ఏకంగా 364 మంది వైరస్ బారినపడినట్టు పేర్కొన్నారు.
కరోనా బారినపడిన 20 వేల మందికిపైగా పోలీసుల్లో 2 వేల మందికిపైగా అధికారులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 208 మంది పోలీసులు మృతి చెందారు.
మరణించిన వారిలోనూ 21 మంది ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్టు చెప్పారు. పోలీసు శాఖలో ఇంకా 3 వేలకుపైగా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు వివరించారు. అలాగే, 16 వేల మందికిపైగా పోలీసులు కోలుకున్నారు.
పంచాయితీ ఎన్నికల పై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు…