కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో టీకాలను వేగంగా అందించాలని, కరోనా కట్టడికి టీకా వేయడం ఒక్కటే సురక్షిత మార్గం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఆక్స్ ఫర్డ్ అస్త్రజెనకా టీకా తో పాటుగా మరికొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆక్స్ ఫర్డ్ టీకా వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీకా తీసుకుంటే రక్తం గడ్డగడుతుందని పలు నివేదికలు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఐరోపాలోని కొన్ని దేశాలు ఈ టీకా వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించాయి. ఐరోపా మెడికల్ ఏజెన్సీ నివేదిక తరువాత తాత్కాలికంగా నిలిపివేసిన దేశాలు తిరిగి వినియోగించడం మొదలుపెట్టాయి. కానీ ఐరోపా దేశమైన డెన్మార్క్ మాత్రం అందుకు విరుద్ధంగా ఆక్స్ ఫర్డ్ టీకాను శాశ్వతంగా నిషేధం విధించింది. డెన్మార్క్ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించింది. ఈ దర్యాప్తు అనంతరం డెన్మార్క్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆక్స్ ఫర్డ్ టీకా లేకుండానే ముందుకు సాగుతామని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది.
previous post
next post