telugu navyamedia
తెలంగాణ వార్తలు

పవన్ కల్యాణ్‌కు కేఏపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ..

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ జనసేన‌ను వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు.

ఒకవేళ గెలిపించలేకపోతే పవన్‌కు రూ. వెయ్యి కోట్లు ఇస్తానన్నారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా గెలవలేరని విమర్శించారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి.. బైబిల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటని కేఏ పాల్ అన్నారు.

అవినీతి పార్టీలతో పొత్తులు పెట్టుకున్న అతిపెద్ద అవినీతి పరుడని ఆరోపించాడు. పవన్ కల్యాణ్ డ్యాన్స్‌లు చేసి.. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న పది లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చుతాడా అని ప్రశ్నించారు.

Related posts