ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ సమయంలోనే హోలీ పండుగ వచ్చింది. ఈనెల 28,29 తేదీల్లో ఇండియాలో హోలీ వేడుకలు జరగబోతున్నాయి. అయితే దేశంలో ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హోలీ వేడుకలపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. హోలీ ఎక్కువగా జరుపుకునే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ ఒకటి. ఉత్తర ప్రదేశ్ లో 20 మంది కంటే ఎక్కువ మంది ఒకేచోట ఉండొద్దని ఆదేశాలు జారీ చేసింది. హోలీ వేడుకలు జరుపుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా హోలీ నిర్వహస్తే ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తామని యోగి సర్కార్ హెచ్చరించింది. మధ్యప్రదేశ్, బీహార్ లో ఈ వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించారు. ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా హోలిపై నిషేధం ఉంది. అలానే, చండీగఢ్, ఢిల్లీలో కూడా హోలీని బ్యాన్ చేశారు. ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. చూడాలి మరి దీని పై తెలుగు రాష్ట్రాలు ఏం నిర్ణయం తీసుకుంటాయి అనేది.
previous post
next post