telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పదిహేనేళ్ల క్రితం నుంచే ఆలియా అంటే ఇష్టం : రణబీర్ కపూర్

Ranbir-Kapoor

బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమాయణం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. వీరు త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల ఓ సమావేశంలో దీపికా పదుకొణె కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేసింది. దాదాపు పదిహేనేళ్ల క్రితమే ఆలియా అంటే రణ్‌బీర్‌కు ఇష్టమేర్పడిందట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ చెప్పాడు. వీరి పెళ్లి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. `సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఓ సినిమా కోసం దాదాపు పదిహేనేళ్ల క్రితమే మేమిద్దరం కలిసి పనిచేశాం. ఫొటోషూట్ కూడా చేశాం. అప్పట్నుంచే నేను ఆలియాకు అభిమానిగా మారాను. అప్పటికి ఆలియా వయసు 11. నా వయసు 20. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పూర్తికాలేదు” అని రణ్‌బీర్ చెప్పాడు.

Related posts