telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

పరిచయం లేని వారు ఇచ్చిన లిఫ్ట్.. తో ప్రమాదాలు.. తస్మాత్ జాగర్త !

women gang raped in capital of india

పని ముగించుకొని రోడ్డుపైకి వస్తే, ఒక్క వాహనం సరైన సమయానికి అందుబాటులో లేకపోవటంతో; ఎవరో ముక్కూమొఖం తెలియని వారు వచ్చి లిఫ్ట్ ఇస్తామంటే .. హమ్మయ్య అంటూ చటుక్కున ఆ బండి ఎక్కి వెళ్లిపోతుంటారు చాలా మంది. కానీ, అందులో ప్రమాదాలు కూడా ఉన్నాయని తాజాగా ఒక సంఘటన రుజువుచేసింది.
ఓ యువతిపై కన్నేసిన ఇద్దరు మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగులు, ఆమెను నమ్మించి, కారెక్కించుకుని మత్తుమందిచ్చి, పదేపదే అత్యాచారం చేశారు. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సాయంత్రం ఆఫీసు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లేటప్పుడు, ఇద్దరు కారులో తారసపడి లిఫ్ట్ ఇస్తామని చెప్పారు.

వారితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, కూల్ డ్రింక్ ను ఇచ్చారు. దాన్ని తీసుకున్న తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. ఆపై వారిద్దరూ వంతులేసుకుని తనపై అత్యాచారం చేశారని, ఆఖరికి వసంత్ కుంజ్ ప్రాంతంలో తనను వదిలేసి వెళ్లిపోయారని ఆరోపించింది. ఆపై తాను ద్వారక ప్రాంతంలోని ఇంటికి చేరుకుని, పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చానని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసును నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని తెలిపారు.

Related posts