ప్రప్రధమంగా ఆస్కార్ పురస్కారాల అకాడమీలో భారతీయులకి చోటు దక్కింది. వారిలో సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, పాపులర్ దర్శకులు అనురాగ్ కశ్యప్, గల్లీ బాయ్ డైరెక్టర్ జోయా అక్తర్‌తో పాటు రితేష్ బత్రా, శ్రీనివాస్ మోహన్ ఉన్నారు. శ్రీనివాస్ మోహన్ ఇటీవల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి విడుదలైన బాహుబలి 2, 2.ఓ చిత్రాలకి విజువల్ ఎఫెక్ట్స్ అందించారు.
2019 సంవత్సరానికి గాను ఆస్కార్ అకాడమీ సభ్యులుగా మొత్తం 842 సభ్యులు ఎంపిక కాగా, అందులో మన భారతీయులు ఉండడం అందరు గర్వపడాల్సిన విషయం.వీరు ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ దక్కించుకునే చిత్రాలని పరిశీలించి వారిలో విజేతలని ఎంపిక చేసే విషయంలో భాగస్వాములు కానున్నారు. గత ఏడాది షారూఖ్ ఖాన్, నసీరుద్దీన్ షా, టబు, మాధురీ దీక్షిత్‌కి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.
పెళ్ళైన తరువాత కూడా శత్రుఘ్న సిన్హా ఎఫైర్… భార్య కామెంట్స్