telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. గ్రేటర్‌లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్‌లో అభ్యర్థులు, పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని పేర్కొంది. పర్మిషన్‌ లేకుండా లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించకూడదని… రికార్డింగ్‌ చేసిన ఉపన్యాసాలు వాటిని వాడాలని తెలిపింది. బహిరంగ సభలు, రోడ్‌ షోలలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు… ఇతర ప్రచారాల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మైక్‌లు ఉపయోగించాలని షరతులు పెట్టింది. ప్రచారం సందర్భంగా ఆస్పత్రుల్లోని రోగులు సౌండ్‌ పొల్యూషన్‌తో ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఊరేగింపు తీయదల్చుకున్న పార్టీలు ముందే అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. ఒకే రోడ్డులో రెండు అంత కన్నా ఎక్కువ పార్టీలు ర్యాలీలు తీయకూడదని… పోలింగ్‌, ఓట్ల లెక్కింపునకు 48 గంటల ముందే లిక్కర్‌ అమ్మకాలను నిలిపివేస్తారు. ఓటర్‌ స్లిప్పులపై ఓటర్‌ పేరు, ఇతర వివరాలు మాత్రమే ఉండాలని…గోడల మీద వ్రాతలు, పోస్టర్లు అంటించడాన్ని నిషేధించింది.

Related posts