telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్‌లో కరోనా కలకలం.. అమీర్ ఖాన్ ను పాజిటివ్!

చైనా నుండి వచ్చిన కరోనా మనదేశాన్ని దాదాపుగా ఏడాది నుండి అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుండి కరోనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పటికే మన దేశంలో చాలా మంది రాజకీయనాయకులకు, సెలబ్రెటీలకు కరోనా సోకింది. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కు కరోనా సోకినట్టు ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఆమిర్ ఖాన్ ప్రస్తుతం తన ఇంటిలోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో ఆమిర్ ఖాన్ ను కలిసి వ్యక్తులు సైతం కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ నెల మొదట్లో ఆమిర్ ఖాన్ ముంబైలో జరిగిన ‘కోయీ జానే నా’ మూవీ స్క్రీనింగ్ కు హాజరయ్యాడు. ఆయన ఆ సినిమాలోని ఓ పాటలో నర్తించాడు. ఇదే సమయంలో సోషల్ మీడియా నుండి తాను వైదొగడంపై జరుగుతున్న ప్రచారానికి వివరణ ఇచ్చాడు. ఎవరికి వారు ఏదేదో ఊహించుకోవడం తగదని, తన ప్రపంచంలో తాను ఉండటానికే ఇష్టపడుతుంటానని, అందుకే సోషల్ మీడియా లో ఇకపై పోస్టులు పెట్టవద్దని అనుకుంటున్నానని అమిర్ తెలిపాడు. కాగా.. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. 

Related posts