telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహిళల భద్రతకు ఇది ఎంతో ముఖ్యం… కేటిఆర్ కు థాంక్స్ చెప్పిన మీరా చోప్రా…!

Meera-chopra

యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు హీరోయిన్ మీరా చోప్రాపై సోషల్ మీడియాలో సాగిస్తున్న ట్రోలింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. `నాకు ఎన్టీయార్ గురించి తెలియదు. నేను ఎన్టీయార్ ఫ్యాన్‌ను కాదు.. నాకు మహేష్ అంటేనే ఎక్కువ ఇష్టం` అన్నందుకు మీరాపై ఎన్టీయార్ ఫ్యాన్స్ అసభ్యపదజాలంతో దూషణలకు దిగారు. మీరాతోపాటు ఆమె తల్లిదండ్రులను కూడా బెదిరించారు. దీంతో మీరా.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ ఎన్టీయార్ అభిమానులు శాంతించకపోవడంతో మీరా తాజాగా మరికొన్ని ట్వీట్లు చేసింది. `నాపై సామూహిక అత్యాచారానికి పాల్పడతానన్నారు. యాసిడ్ దాడి చేస్తామన్నారు. మా తల్లిదండ్రులను చంపేస్తామన్నారు. వీటిని ఆపడం ఎలా? మహిళలకు కనీసం గౌరవం లేదు. ఈ రోజు నేను.. రేపు మరొకరు. ఈ పోరాటంలో నేను నిలబడతా. వాళ్లు (ఎన్టీయార్ ఫ్యాన్స్) మహిళలకే కాదు.. ఎవ్వరికీ గౌరవం ఇవ్వడం లేదు. మిగతా నటులను కూడా అసభ్యంగా తిడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా రూపంలో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కానీ, మీరు మాత్రం.. మీ అభిమాన నటుడు నాకు తెలియదన్నందుకు నన్ను తిడుతూ రాక్షసానందం పొందుతున్నారు. ముందు వెళ్లి మీ జీవితాలను రక్షించుకోండి` అని ట్వీట్లు చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ మీరా చోప్రా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేసింది. దాంతో ఆయన వెంటనే స్పందించి రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ సీపీలకు విషయం తెలియజేశారు. దీనిపై మీరా చోప్రా ట్విటర్ లో కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపింది. “థాంక్స్ సర్… మీ మేలు మర్చిపోలేను. మహిళల భద్రతకు ఇది ఎంతో ముఖ్యం అని భావిస్తున్నాను. ఇలాంటి వాళ్లను స్వేచ్ఛగా వదలకూడదు, లేకుంటే మహిళలపై నేరాలు మరింత పెరుగుతాయి” అంటూ ట్వీట్ చేసింది.

Related posts