telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్ తో పాటుగా వాటిని కూడా విదేశాలకు భారత్ ఎగుమతి…

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు ఈ ఏడాది ఆరంభం నుండి వ్యాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే టీకా అందుబాటులోకి వచ్చిన తరువాత ఆ టీకాను ప్రపంచంలోని అనేక దేశాలకు అందిస్తోంది.  దాదాపుగా 7.8 కోట్లకు పైగా టీకాను ఇప్పటికే అనేక దేశాలకు సరఫరా చేసింది.  అయితే, టీకా అందించాలి అంటే సిరంజ్ తప్పనిసరి అవుతుంది.  అమెరికా, చైనా తరువాత అత్యధికంగా సిరంజ్ లను ఉత్పత్తి చేసే దేశం ఇండియా.  ఇండియాలోని ఫరీదాబాద్ లో ఉన్న హిందూస్తాన్ సిరంజిస్ అండ్ మెడికల్ డివైజెస్ సంస్థ సిరంజిలను తయారు చేస్తోంది.  నిమిషానికి 5,900 సిరంజిలను తయారు చేసే సామర్ధ్యం కలిగిన ఈ సంస్థ సంవత్సరానికి 270 కోట్ల సిరంజిలను తయారు చేస్తున్నది.  ప్రస్తుతం మూడొంతులు ఇండియా అవసరాలకు, మిగిలిన ఒక వంతు విదేశాలకు సప్లై చేస్తున్నది.  అయితే, ఇప్పుడు టీకాలు అందుబాటులోకి రావడంతో సిరెంజ్ ల అవసరం ఏర్పడింది.  అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ వంటి అనేక దేశాల నుంచి సిరెంజ్ లు కావాలని చెప్పి రోజుకు వందల కొద్దీ మెయిల్స్ ఈ వస్తున్నాయట.  దీంతో ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచి వీటిని కూడా ఎగుమతి చేసే ఆలోచనలో ఉన్నారంట…!

Related posts