telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇది చాలా అద్భుతం.. కేవలం ఒకే ఒక్క మనిషి డొనాల్డ్‌ ట్రంప్ ఇది చేయగలిగారు : ఆర్జీవీ

RGV

అమెరికాలో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్యలు విచిత్రంగా ఉంటున్నాయంటూ తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సెటైర్లు వేశారు. రామ్‌ గోపాల్‌ వర్మ తన ట్విట్టర్‌ ఖాతాలో “ఇది చాలా అద్భుతం.. కేవలం ఒకే ఒక్క మనిషి డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికాను ఒక జోక్‌లా చూసేలా చేశారు” అని పేర్కొన్నారు. ఆయన చేసిన ట్వీట్‌పై స్పందిస్తోన్న నెటిజన్లు.. నీ దృష్టి కొన్ని రోజులుగా డొనాల్డ్ ట్రంప్‌పై పడిందేంటీ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో వర్మ “క్లైమాక్స్” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం జూన్ 6న ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts