తెలుగు చిత్ర సీమలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటులలో అడవి శేష్ కూడా ఒకడనడంలో సందేహం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరిస్తుంటాడు. అలాంటి అడవి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ కనిపించనున్నాడు. ఈ సినిమా నిజ జీవితం ఆధారంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కొన్ని సంవత్సారల పాటు శేష్ శ్రమించాడు. అయితే ఉగాది కానుకగా ఈరోజు ఈ సినోమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ సినిమా కోసం శేష్ ఎంతగానో కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో ఉన్ని కృష్ణన్‌లా ఉండాలని అతడిని అర్థం చేసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మహేష బాబు బ్యానర్‌లో నిర్మితమవుతోంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ వారు అంతర్జాతీయంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా శశి కిరన్ దర్శకత్వంలో తెరకెక్కతోంది. మరి ఈ సినిమా ఎంతవరకు విజయం సాధింస్తుందో వేచి చూడాలి.
previous post
next post
ప్రత్యేకహోదాను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు:నారాయణ