telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మత్తు వదలరా” ఫస్ట్ లుక్… నా తమ్ముళ్లు పెద్దవాళ్లైపోయారు అంటున్న ఎన్టీఆర్

Mathu

కీరవాణి చిన్న కుమారుడు సింహా హీరోగా, పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న సినిమా `మత్తు వదలరా`. అందరూ కొత్తవాళ్లతో రూపొందుతున్న ఈ చిత్రం సస్సెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో హీరోగా సింహా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవ, డైరెక్టర్‌గా రితేష్ రానా, సినిమాటోగ్రాఫర్‌గా సురేష్, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా శంకర్, నటులుగా నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని, మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఎన్టీయార్ ట్విటర్ ద్వారా విడుదల చేశారు. ‘‘కాలం వేగంగా పరిగెడుతోంది. నా తమ్ముళ్లు చాలా పెద్దవాళ్లైపోయారు’’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్.. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుల గురించి ట్వీట్ చేశారు. ఈ సినిమాతో అరంగేట్రం చేస్తున్న కాల భైరవ, సింహాకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts