telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఖైదీలతో టిఫిన్ సెంటర్ .. 5 రూపాయలకే 4 ఇడ్లిలు..

tiffine center by prisoners 4 idli for just 5 rupees

పుట్టుకతోనే ఎవరూ నేరస్దులు కారు. నేరస్దులుగా మారిన ప్రతివారు చెడ్దవారు అనిపించుకోరు. ఎదో ఆవేశంలో, మనసులో కలిగిన ఆశవల్లనో తప్పులు చేస్తారు. కాని క్రమ క్రమంగా తప్పుచేసిన కొందరిలో మార్పును చాలా లేటుగా గమనించవచ్చూ. కాని అప్పటికే జరగవలసిన దారుణం జరిగిపోతుంది. వయస్సు, సమయం జైళ్లలోనే గడచిపోతాయి. జైళ్లో వారి ప్రవర్తనలో మార్పు రావాలని జైలు అధికారులు ప్రయత్నిస్తుంటారు. మహాబూబ్ నగర్ జైలు ఖైదీలు మై నేషన్ క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఐదు రూపాయలకు నాలుగు ఇడ్లీలు విక్రయిస్తున్నారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ మార్గ దర్శకత్వంలో ఈ క్యాంటీన్ మొదలుపెట్టారు. ఇకపోతే ఈ క్యాంట్‌ను జిల్లా కలెక్టర్ డీ రోనాల్డ్ రోజ్, జైళ్ల శాఖ డీఐజీ భాస్కర్ లు ప్రారంభించారు.

ఈ టీఫిన్ సెంటర్లో ఉదయం 6 నుండి 11 గంటల వరకు రోజుకు 1,500 ప్లేట్ల ఇడ్లీలను విక్రయిస్తారని అధికారులు చెబుతున్నారు. తినుబండారాలకు ప్లాస్టిక్‌ వాడకాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. పార్శిల్‌ల కోసం టిఫిన్ బాక్స్‌లను తీసుకురావాలని వినియోగదారులను కోరుతున్నామని తెలిపారు. కస్టమర్లకు నాణ్యమైన ఇడ్లీలను స్టీల్ ప్లేట్లలో వడ్డిస్తున్నారు. శుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.

Related posts