telugu navyamedia
సినిమా వార్తలు

ఓ బేబీ : భారీ కటౌట్ పై నెటిజన్ కామెంట్… సమంత రియాక్షన్

Samantha

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత సరికొత్త లుక్ లో కనిపించనుంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌ లోని ఓ థియేటర్‌ దగ్గర ఏర్పాటు చేసిన బాహుబలి సైజ్ సమంత కండల కటౌట్ పై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. తన స్నేహితుడు ఈ కటౌట్ ను తన జిమ్ కు వ్యాపార ప్రకటన నిమిత్తం వాడుకోవాలని భావిస్తున్నాడని, మీ కటౌట్ ను కొద్దిగా మార్చి కండలు కనిపించేలా చేశాడని చెప్పిన ఓ నెటిజన్ వ్యాఖ్యపై సమంత కూడా స్పందించింది. “బేబీ ఆన్‌ స్టెరాయిడ్స్‌” అని సమాధానం ఇచ్చింది.

Related posts