telugu navyamedia
సినిమా వార్తలు

అందంగా ఉందని యువతికి చలానా రాసిన ట్రాఫిక్ పోలీస్

Traffic-Police

అమ్మాయిలను పడేయడానికి అబ్బాయిలు ఎన్నో తంటాలు పడుతుంటారు. అయితే చట్టానికి లోబడి పనిచేస్తున్న ఓ అధికారి తన వృత్తిని ప్రేమ కోసం వాడుకుంటే? ఉరుగ్వేలో సరిగ్గా ఇదే జరిగింది. పెసందే ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బండి మీద వెళ్తున్న ఓ యువతిని విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ పోలీస్ ఆపి.. ఆమెకు చలానా రాశాడు. హెల్మెట్ లేదనో, లెసెన్స్ లేదనో రాస్తే అనుకోవచ్చు.. అందంగా ఉందని యువతికి చలానా రాశాడా పోలీస్. పబ్లిక్ రోడ్లపై అందగత్తె(ఎక్సెసివ్ బ్యూటీ ఆన్ పబ్లిక్ రోడ్స్) అంటూ చలానా రాశాడు. ఆ చలానాను యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది.. ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అయిపోయింది. పైఅధికారుల వరకు ఈ వార్త వెళ్లడంతో ఆ ట్రాఫిక్ పోలీస్‌పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

Related posts