telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రామ్ కొత్త సినిమా అతనితోనే ఫిక్స్…

ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ బాట పట్టిన హీరో రామ్ రెడ్ తో దానిని కొనసాగించాడు. అయితే ఈ సంక్రాంతికి విడుదలై హిట్ అందుకున్న రెడ్ తర్వాత రామ్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది తెలియదు. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. రామ్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందంటూ ఇటీవల వార్తలు వఛ్చినప్పటికీ అవి అవాస్తవం అని తేలిపోయింది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్‌ సినిమా నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రాపొ19గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్6గా శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. అయితే ఏప్రిల్ నుండి సినిమా ర్యేగులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. దర్శకుడు లింగుస్వామి తెలుగులో ‘పందెం కోడి’, ‘ఆవారా’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సినిమాకు సంబంధించిన తదితర వివరాలను అతి త్వరలో ప్రకటించనున్నారు. చూడాలి సినిమా మరి ఈ సినిమా ఎప్పటికి విడుదల అవుతుంది అనేది.

Related posts