telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కమల్ హాసన్, రాధిక…

దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్‌ నిన్న ఉదయం 10 గంటల నుంచే ప్రారంభం అయింది. రెండో విడతలో 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు, 45 సంవత్సరాలు దాటిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికీ వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా టీకా వేయించుకున్నారు. అంతేకాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయా నాయకులతో సహా, సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు కూడా కరోనా టీకా వేయించుకుంటున్నారు. అయితే.. తాజాగా టాలీవుడ్ సినీయర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఈరోజు కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకున్నారు. ఈ మేరకు రాధికా ట్వీట్ చేశారు. ‘మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటు మీ ఆప్తులను కూడా కాపాడుకునేందుకు కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకోండి’ అని రాధిక ట్వీట్‌లో రాసుకొచ్చారు. అలాగే తమిళ్‌ స్టార్‌ కమల్ హాసన్‌ కూడా ఇవాళ కరోనా టీకా వేయించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కరోనా టీకా తీసుకున్నారు.

Related posts