నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. హైకోర్టు తీర్పు నియంతపాలనకి చెంపపెట్టని వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోరి ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారికి న్యాయం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచనా ధోరణిలో మార్పువస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
మీకు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేస్తారని, అరాచకం సృష్టిస్తారని కాదు. మేమింతే అంటే జగన్‌కి మంచిదికాదని హితవు పలికారు. మరోసారి జగన్ గారు, విజయసాయిరెడ్డి గారు జైలుకి వెళ్లడం ఖాయం’ అని బుద్ధా వెంకన్న అన్నారు. హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ ఇకపైనైనా తన తీరును మార్చుకోవాలని ఆయన సూచించారు.
బీజేపీలో టీడీపీ విలీనం చెందిందన్నది వట్టిదే: గల్లా జయదేవ్