telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్​ఆర్​ఆర్’​​పై తారక్ ఎమోషనల్ థాంక్యూ నోట్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్​ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్​ చరణ్​ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్​ఆర్​ఆర్’​. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం.. బ్లాక్​బస్టర్​ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్​ వసూళ్లను రాబట్టి బాహుబలి రికార్డుని తిరగరాసింది.

RRR Movie: నీవు లేకుండా నన్ను నేను ఆర్ఆర్ఆర్‌లో ఉహించుకోలేను.. తారక్ ఎమోషల్ లెటర్

ఈ నేప‌థ్యంలో తనకు ఇంతటి ఘ‌న విజ‌యాన్ని అందించిన రాజమౌళి, చరణ్​ సహా ‘ఆర్​ఆర్​ఆర్’​ బృందానికి థ్యాంక్స్​ చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ సుధీర్ఘ లేఖని విడుదల చేస్తూ.. పేరు పేరునా అందరికి ధన్యవాదాలు తెలిపాడు.

నేను నా బెస్ట్ ఇవ్వడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన జక్కన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు. నిజంగా నాలోని బెస్ట్ ని బయటికి తీసుకొచ్చి నేనొక వాటర్ లా ఫీలయ్యేలా చేశావు. తనలోని గొప్ప నటుడ్ని వెలికితీసి మరచిపోలేని చిత్రాన్ని ఇచ్చిన జక్కన్నకు ధన్యవాదాలు తెలిపారు.  

RRR getting postponed? SS Rajamouli makes big announcement about Ram  Charan, Jr NTR, Alia Bhatt starrer's release date

తనలోని గొప్ప నటుడిని వెలికితీసిన జక్కనకు ధన్యవాదాలు తెలిపాడు.. నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించావు అని అన్నారు . ఇక నా బ్రదర్​ చరణ్​ లేకపోతే ‘ఆర్​ఆర్​ఆర్’​చిత్రాన్ని ఊహించుకోలేను అల్లూరి సీతారామరాజు పాత్రకు నీవు తప్ప మరెవరూ న్యాయం చేయలేరు. ‘ఆర్​ఆర్​ఆర్’ సినిమాయే కాదు, భీమ్​ కూడా నువ్వు లేకుంటే అసంపూర్ణమే. ఈ నీటికి నిప్పులా తోడైనందుకు ధన్యవాదాలు.

లెజెండరీ హీరో అజయ్ దేవగణ్ గారితో నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ఆలియా భట్ పవర్ హౌస్. తన పాత్రతో సినిమాకు బలం చేకూర్చింది. ఒలీవియా, అలీసన్ డూడీ,రే స్టీవెన్ సన్ తమ నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇండియన్ సినిమాకు వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాను” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

RRR Movie: Jr NTR Thanks TO Rajamouli, Ram Charan And Other Team Members - Sakshi

అలాగే నిర్మాత దానయ్య, సంగీత దర్శకుడు కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, సెంథిల్, సాబూ సిరిల్​, శ్రీనివాస మోహన్, ఎడిటర్ శ్రీకర్​ ప్రసాద్, కార్తికేయ, కాలభైరవ, ప్రేమ్​ రక్షిత్​లకు ధన్యవాదాలు చెప్పారు.

ఇక లేఖ చివర్లో ఇండస్ట్రీకి, మీడియా, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపిస్తున్న ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. ఇంకా ఎన్నో మంచి సినిమాలతో అలరిస్తానని తన అభిమానులకు వాగ్దానం చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ రాసిన లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related posts