తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల.. ఆ తర్వాత రోజు.. ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.. వైఎస్ షర్మిల పార్టీ పెడతారని వార్తలు రాగానే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు కూడా మారిపోయాయి. అటు షర్మిల పార్టీ స్థాపన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 9న కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు ఇప్పటికే తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులు మద్దతు కూడా పలికారు. మరోవైపు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా వైఎస్ షర్మిల పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఈ కోవలోనే ప్రముఖ తెలుగు టీవీ యాంకర్, నటి శ్యామల.. లోటస్పాండ్లో తన భర్త నరసింహారెడ్డి కలిసి షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా షర్మిల పార్టీ పెడితే.. సినీ ఇండస్ట్రీ నుంచి తొలి కండువా కప్పుకునేది తానేనని శ్యామల చెబోతుంది.