telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కల్యాణ లక్ష్మి పథకం : గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది. అనతికాలంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదుగుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో ఈ రంగంపై సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. రైతులకు పెద్దపీట వేస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కం ఎంతో మంది నిరుపేద‌ల కుటుంబాల్లో వెలుగులు నింపింది. పేదింటి ఆడ‌బిడ్డ‌ల వివాహానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల‌క్షా నూట ప‌ద‌హారు రూపాయాలు అందించి ఆర్థికంగా ఆదుకుంటున్నారు. దీంతో ఆ ఆడ‌బిడ్డ‌లు కేసీఆర్‌ను మేన‌మామ‌గా వ‌ర్ణించుకుంటూ.. ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటామ‌ని చెబుతున్నారు. అలాంటి గొప్ప ప‌థ‌కానికి నాలుగవ త్రైమాసికానికి సంబంధించి రూ.337 కోట్లు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ మేర‌కు బీసీ సంక్షేమశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కానికి నిధులు విడుదల చేస్తూ పరిపాలన శాఖ అనుమతులు మంజూరు చేసింది.

Related posts