telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ ఫాన్స్ కు షాక్ : ఆచార్య మూవీపై కరోనా పడగ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 40నిమిషాల నిడివి ఉన్న పాత్రతో చెర్రీ అందరినీ ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా, చరణ్‌కు జోడీగా పూజా హెగ్దె నటిస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా చేసింది చిత్ర బృందం. ఏ మేరకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ కినిమను మే 13 న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ఇదివరకే ప్రకటించగా.. కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తిరిగి కరోనా కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేకే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపింది చిత్ర బృందం.  

Related posts