telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మోదీ హయాంలో తెలంగాణకు కొత్త రైళ్లు: కిషన్​ రెడ్డి

kishanreddy on ap capital

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ప్రాంతంలోని ప్రజలకు కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణ ప్రాంతంలోని ప్రజలకు రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.

మోదీ హయాంలో తెలంగాణకు కొత్త రైళ్లు, రైల్వే మార్గాలు వచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణలో 48 కొత్త రైళ్లను ప్రారంభించారని చెప్పారు. 2014-15 రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.258 కోట్లు కేటాయించారని, ఈ రోజున ఆ కేటాయింపులు రూ.2601 కోట్లకు చేరాయంటే తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం ఏవిధంగా పాటుపడుతుందో స్పష్టమౌతోందని అన్నారు.

Related posts