ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని అన్నారు.
రాజ్యాంగాన్ని ధిక్కరించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశించారు. దేశంలోని సర్వోన్నత న్యాయస్థానంలో సాక్షాత్తు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏపీలో అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే మీ పాలన ఎలా ఉందో అర్థమవుతోందని జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు.న్యాయ వ్యవస్థతో మాకు సంబంధం లేదు, రాజ్యాంగం మాకు అక్కర్లేదు అంటూ మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి ఇదేమీ నియంత పాలన కాదన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం అని మర్చిపోవద్దని హితవు పలికారు.