telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై జేపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Loksatha comments Janasena

తెలంగాణలో 40 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని, పరిపాలనలో ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. బడ్జెట్, విధానపరమైన నిర్ణయాలు కోర్టులు చేయలేవని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇరుపక్షాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని జేపీ సూచించారు.

మరో వైపు సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదంటూ కేసీఆర్ సర్కారుపై మండిపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదని ధ్వజమెత్తాయి.

Related posts