telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అమిత్ షాతో సీఎం జగన్ శ్రీవారి దర్శనం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తిరుపతి, తిరుమల పర్యటన ఖరారైంది. రెండు రోజులు పాటు ఆయన తిరుపతిలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. .

షెడ్యూల్ ప్రకారం జగన్ ఈ రోజు సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలు దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా తిరుపతి తాజ్ హోటల్‌లో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అమిత్ షాకు స్వాగతం పలుకనున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి తిరుమలకు వెళ్లి రాత్రి 9.30గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. ఆపై జగన్‌ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలు దేరతారు.

YS Jaganmohan Reddy visits Tirumala temple, offers silk clothes to Lord Balaji

ఆదివారం షెడ్యూల్..

ఆదివారం కూడా తిరుపతిలో జగన్‌ పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరవుతారు. అమిత్‌షా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.సమావేశం అనంతరం జగన్, అమిత్ షాలు ప్రత్యేకంగా విందు చేయనున్నారు.

Related posts