telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ భారీ ప్రాజెక్ట్ నుంచి ఐశ్వర్యారాయ్ అవుట్ ?

ishwarya-Rai

తమిళ అగ్రదర్శకుడు మ‌ణిర‌త్నం ఈసారి భారీ బ‌డ్జెట్‌తో హిస్టారిక‌ల్‌ చిత్రాన్ని తెర‌కెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 800 కోట్ల బ‌డ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం. క‌ల్కీ రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే చారిత్ర‌క న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇక న‌టీనటుల విష‌యానికి వ‌స్తే ఇటు సౌత్‌, అటు నార్త్‌కి సంబంధించిన ప‌లువురు స్టార్స్ ఇందులో భాగం కానున్నార‌ని చెబుతున్నారు. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, మోహ‌న్ బాబు, ఐశ్వ‌ర్య‌రాయ్, అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి ప‌లువురు స్టార్స్ నటిస్తున్నారు. ‘పొన్నియన్‌ సెల్వన్‌’ కథని వెండితెరపై ఆవిష్కరించడం తన కలగా పలు సందర్భాల్లో ఆయన పేర్కొన్న సంగతి తెల్సిందే. బడ్జెట్‌, తారాగణం ఎంపికలో ఇబ్బందుల కారణంగా ఇన్నాళ్లూ ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ తర్వాత కరోనా ఎంటర్ అయ్యింది. దాంతో షూటింగ్ కు మళ్ళీ బ్రేక్ పడింది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ శుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కరోనా ప్రభావంతో చిత్రీకరణ ఆపుకున్న ఈ సినిమా పరిస్థితులు చక్కబడిన వెంటనే ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి అందాల నటి ఐశ్వర్యారాయ్ ని తొలగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐష్ కి కరోనా రావడంతో హాస్పిటల్ చికిత్స తీసుకుంటోంది. దీంతో ఇప్పటికే డిలే అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ కి మళ్ళీ బ్రేక్స్ పడే ఛాన్స్ ఉండటంతో ఐశ్వర్యని ఈ సినిమా నుంచి తొలగించాలని డెసిషన్ తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తలపై రావాల్సి ఉంది.

Related posts