ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వ్యహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే శుక్రవారంలోగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు. సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. నిర్ణయాన్ని గౌరవించి నిమ్మగడ్డ రమేష్ ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరైనదని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి ఆ నిర్ణయం ప్రజలను కాపాడిందని చెప్పారు.కోర్టులకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రఘురాజు అన్నారు.
మనది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య దేశమని, న్యాయ వ్యవస్థలను, కోర్టులను గౌరవిద్దామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడమే తన తప్పైపోయిందని అన్నారు.
ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే టీడీపీ: విజయసాయిరెడ్డి