“అరవింద సమేత” సినిమా హిట్ తో జోరు మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” అనే క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తున్నాడు. పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2020లో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వచ్చే ఏడాది జూనియర్ వరుస సినిమాలతో బిజీ కానున్నట్టు తెలుస్తోంది. “కేజీఎఫ్” చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఓ చిత్రాన్ని, త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. “అరవింద సమేత” తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా వస్తే అభిమానుల అంచనాలు భారీగా ఉంటాయి. అయితే “ఆర్ఆర్ఆర్” తర్వాత ఎన్టీఆర్ చేయనున్న ఈ ప్రాజెక్టులకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
previous post