telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అల్లరో’డికి.. పుట్టినరోజు శుభాకాంక్షలతో.. ‘బంగారు బుల్లోడు’..

happybirthday allarinaresh with bangaru bullodu

‘బంగారు బుల్లోడు’ తో మరోసారి అల్లరి నరేశ్‌ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధం అవుతున్నాడు. నేడు నరేశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. నరేశ్‌ మాస్‌గా తయారై స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్నట్లుగా పోస్టర్‌లో చూపించారు. ఉగాదికి సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. పి.వి గిరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూజా ఝవేరీ కథానాయికగా నటిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఏప్రిల్‌లో విడుదలైన ‘మహర్షి’ చిత్రంలో నరేశ్‌కు మంచి పాత్ర దక్కింది. ఆ పాత్రలో నరేశ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమంటూ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులూ అభినందించారు. ఆ చిత్రం తరువాత ఇదే అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రం.

Related posts