telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు శుభవార్త…భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

కరోనా వైరస్‌ ప్రభావంతో పెరిగిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ తగ్గాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్ఢ్ స్థాయిలో రూ. 50 వేలు దాటిపోయింది. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. అయితే… తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. నిన్నటి రోజున బంగారం ధరలు స్వల్పంగా పెరగగా.. ఈరోజు భారీగా తగ్గాయి. ఢిల్లీలో మాత్రం భారీగా పెరిగాయి బంగారం ధరలు. ఢిల్లీ విషయానికి వస్తే… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరగడంతో రూ. 53, 180 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరగడంతో రూ. 48, 750 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గడంతో రూ. 50, 500 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గడంతో రూ. 46,300 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే రూ. 1500 తగ్గడంతో రూ.68,000 కు చేరుకుంది.

Related posts