telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

స్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..10 మంది టీచర్ల పై సస్పెన్షన్‌ వేటు!

english medium classes in kasturiba schools

ప్రభుత్వ పాఠశాలలో విద్యాప్రమాణాలు మెరుగు పరిచేందుకు అధికారులు సమీక్షలు చేస్తున్నప్పటికీ కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మహాబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్డులో ఉన్న బాలిక పాఠశాలలో నిన్న ఉదయం 9.15 గంటలకు కలెక్టర్‌ పాఠశాలను సందర్శించారు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య 16 . వీరంతా ఉదయం 9 గంటలకు విధులకు హాజరు కావాలి.

కానీ సమయపాలన పాటించింది నలుగురే. ఉపాధ్యాయులు లేకపోవడం చూసి అవాక్కయ్యారు. రాని వారిలో పది మంది సమయ పాలన పాటించలేదని తెలుసుకుని సస్పెన్షన్‌ వేటుకు ఆదేశాలు జారీ చేశారు. తొలుత ఆయన పాఠశాల ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడంతో ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికి కూడా మిగిలిన ఉపాధ్యాయులు రాకపోవడంతో వారిని సస్పెండ్‌ చేయాల్సిందిగా డీఈఓకు ఆదేశాలు జారీచేశారు.

Related posts