telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పసుపుతో చేసిన టీ ఎప్పుడైనా తాగారా..

పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాల్లో విరివిగా పండుతుంది. దుంపలపై ఉండే చెక్కు తీసి, ఎండ బెట్టి గృహస్థాయిలో తయారు చేసే పసుపును ముఖ్యంగా పూజలకు, ఇంటిలో వంటలకు వాడుతుంటారు. వాణిజ్య పరంగా పసుపుకు చాలా ప్రాముఖ్యం ఉంది. అలానే పసుపు టీ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి పసుపు టీ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. పసుపు పొడి, తేనె, చిటికెడు మిరియాల పొడితో పసుపు టీని తయారు చేసుకోవచ్చు.
ఉపయోగాలు…
క్యాన్సర్‌ నుంచి రక్షిస్తుంది. మతిమరుపు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా కీళ్ల సంబంధిత వ్యాధుల నివారణకు పసుపు చక్కటి పరిష్కారం చూపిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ ఉన్న వారికి కూడా ఇది మంచి పరిష్కారం ఇస్తుంది. వెయిట్‌ లాస్‌ అవ్వడానికి కూడా ఇది మంచి పద్ధతి. పసుపు టీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని తాగాల్సిందే.

Related posts