telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మద్యం అమ్మకాలను తగ్గించేలా ఏపీ సర్కార్ నిర్ణయం!

MLC Elections 3 days closed Liquor shops

రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తామని ఏపీ సీఎం జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మద్యం నిషేధంపై ప్రభుత్వం దృష్టిసారించింది. తొలి విడతగా 20శాతం మద్యం అమ్మకాలను తగ్గించేలా చర్యలకు శ్రీకారం చుట్టింది. కార్పొరేషన్ ద్వారా మద్యం అమ్మకాలపై విధివిధానాల రూపకల్పన చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.

ఇందులో భాగంగానే ఏపీ బేవరెజేస్ కార్పొరేషన్ ద్వారా అమ్మకాలు జరిపేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,377 షాపులకు గానూ 3,500 షాపుల్లోనే మద్యం అమ్మకాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న షాపులనే అద్దెకు తీసుకుని కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం అమ్మకాల కోసం ప్రతి షాపునకు ఓ సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్‌లను బేవరేజెస్ కార్పొరేషన్ నియమించనుంది.

Related posts