telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

హర్యానాలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ…

మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో కేసులు అధికంగా వస్తున్నాయి. దాంతో ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. అయితే ఈ లాక్ డౌన్ విధానం మన ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి ఆ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నాయి. అయితే తాజాగా క‌రోనా ఉధృతి నేపథ్యంలో హర్యానాలో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఇవాళ‌ ఉత్తర్వులు జారీ చేసింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం.. ఇక్క‌డ తొలిసారి ఈ నెల 3 నుంచి 10 వరకు లాక్‌డౌన్ విధించ‌గా.. ఆ త‌ర్వాత‌ 17 వరకు పొడిగించారు.. ఇక‌, రేపటితో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల 24 వరకు హర్యానాలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. అయితే, కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో.. లాక్‌డౌన్‌ నిబంధనలు మ‌రింత‌ కఠినంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ అధికారులను ఆదేశించారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts