telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ వేదికల మార్పు పై క్లారిటీ ఇచ్చిన గంగూలీ….

షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌ 2021 సీజన్‌ను నిర్వహిస్తామన్నాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ఆటగాళ్లతో పాటు ముంబై వాంఖడే స్టేడియం మైదాన సిబ్బంది, పలువురు ఈవెంట్ ఆర్గనైజర్స్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఐపీఎల్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోపక్క మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆలోచన చేస్తుండటంతో ముంబై వేదికగా జరగబోయే మ్యాచ్‌లు తరలింపు ఖాయమనే వార్తలొచ్చాయి. దీంతో బ్యాకప్ వేదికలుగా ఉన్న హైదరాబాద్‌కు మ్యాచ్‌లు తరలిస్తారని అంతా భావించారు. కానీ ఈ అంశంపై మాట్లాడిన బీసీసీఐ బాస్.. ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశాడు. ‘ముంబై వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లు అక్కడే జరుగుతాయి. మహారాష్ట్రలో లాక్‌డౌన్ ప్రకటిస్తే మాకే మంచిది. ఎందుకంటే జనసంచారం అస్సలు ఉండదు. యూఏఈలో జరిగిన గత సీజన్‌లో కూడా బబుల్ బయట ఇలాంటి ఘటనలే జరిగాయి. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా టోర్నీ పూర్తి చేశాం. ఇప్పుడు కూడా అంతే. లాక్‌డౌన్ అనేది మాకు అసలు సమస్యే కాదు. అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Related posts