telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు విశాఖకు ముగ్గురు సీఎంలు..టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం

Mamata_Naidu_Kejriwa-three-

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు మద్దతుగా ముగ్గురు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేయనున్నారు. నేడు టీడీపీ నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాల్గొననున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న సభలో కేజ్రీవాల్, మమతా బెనర్జీ ప్రసంగించనున్నారు.

ఈ ఇద్దరు సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సీఎం చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబును మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున శ్రీభరత్, వైసీపీ నుంచి సత్యనారాయణ, జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి బరిలో ఉన్నారు.

Related posts