telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఇకపై వైట్ హౌస్ నుంచే నేరుగా నిధులు: ట్రంప్

trump usa

కరోనాను జాతీయ విపత్తుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మహా విపత్తు నెలకొని వుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై ఫెడరల్ ప్రభుత్వ నిధులను రాష్ట్రాలు కరోనా నివారణకు, వ్యాప్తి నిరోధానికి వినియోగించుకోవచ్చని ట్రంప్ వెల్లడించారు. వైట్ హౌస్ నుంచే నేరుగా రాష్ట్రాలకు నిధులందుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ లను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని ఆయన వెల్లడించారు.

అమెరికాలో కోవిడ్-19 మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మృతుల విషయంలో ముందున్న ఇటలీని కూడా అమెరికా అధిగమించింది. శనివారం నాడు 1,912 మంది మరణించారని, దీంతో మృతుల సంఖ్య 20,597కు చేరిందని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ ప్రధానంగా న్యూజెర్సీ, న్యూయార్క్ ప్రాంతాల్లో కరోనా మహమ్మారి ప్రభావం చూపగా, ఇప్పుడు చికాగోతో పాటు మధ్య, పశ్చిమ ప్రాంతాలకూ విస్తరిస్తోందని వైట్ హౌస్ ప్రకటించింది.

Related posts