telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

తానాజీ చిత్రం ప్రమోషన్స్ లో .. భావోద్వేగానికి గురైన.. కాజోల్ …

kajol emotional on tanaji promotions

బాలీవుడ్ లో అజయ్ దేవగన్-కాజోల్ జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే అలాంటి క్యూట్ కపుల్ అయిన స్టార్ హీరోయిన్ కాజోల్ కు ఓ సినిమా వల్ల అబార్షన్ అయ్యిందట. తన భర్త అజయ్ దేవగణ్‌తో కలిసి నటించిన చిత్రం ‘తానాజీ’ చిత్రం ప్రేమోషన్స్ లో కాజోల్ ఈ విషాదకరమైన ఘటన గురించి చెప్పుకొచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌, జయాబచ్చన్‌, కాజోల్‌, షారుఖ్‌ కీలకపాత్రల్లో నటించిన కుటుంబ కథా చిత్రం ‘కబీ ఖుషి కబీ గమ్‌’. ఈ చిత్రం 2001లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది.

ఆ సినిమా విడుదల అయిన సమయంలో ఆమెకు అబార్షన్ జరిగింది అని నటి కాజోల్ సంచలన నిజాన్ని బయట పెట్టారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంత.. ”అయ్యో కాజోల్.. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చింది నీకు.. ఎలా ఎదురుక్కున్నావు” అంటూ బాధ పడిపోతున్నారు. దీంతో ఈ వార్త గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయ్యో కాజోల్.. నీకు వచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు అంటూ బాధ పడిపోతున్నారు. కాగా నేయున్న తన భర్తతో కలిసి నటించిన తానాజీ చిత్రం విడుదలయ్యింది.

Related posts