telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న యూపీ సీఎం…

మన దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. ఇప్పటికే భారత్‌లో లక్షకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర కలవరమే రేపుతోంది.. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా వేగవంతం చేసింది ప్రభుత్వం.. ఈ నెల 1వ తేదీ నుంచి 45 ఏళ్లకు పైబడినవారికి అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు.. ఇక, ఇవాళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.. లక్నోలోని సివిల్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. కోవిడ్ వ్యాక్సిన్ మొదట డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన యూపీ సీఎం.. కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీకి.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు.. కరోనాకు చెక్ పెట్టేందకు వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల కృషి అమోఘమంటూ కొనియాడారు సీఎం యోగి. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా.. కరోనా నిబంధనలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే చూడాలి మరి ఈ కేసులు ఇంకా పెరుగుతాయా… లేదా తగ్గుతాయా అనేది.

Related posts