telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో త్వరలోనే ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్…

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు… 50 వేల ఉద్యోగాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇక, గ్రంథాలయంలోని వసతుల గురించి ఆయన మాట్లాడుతూ.. మహిళల కోసం వనిత పేరుతో ఒక వింగ్ ఏర్పాటు చేశాం.. మూడు భాషలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంచామని తెలిపారు.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పిల్లల కోసం ఒక రీడింగ్ హల్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన మంత్రి.. డిజిటల్ లైబ్రరీలో కూడా 40 కంప్యూటర్లను ఏర్పాటు చేశామన్నారు.. నేషనల్ డిజిటల్ లైబ్రరీ కి అటాచ్ చేశామని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ బుక్ అందులో అందుబాటులో ఉందని.. దీనిని యువత బాగా వినియోగించుకోవాలని సూచించారు మంత్రి హరీష్‌రావు. అయితే ఈ మధ్యే కేయూలో ఓ విద్యార్థి ఉద్యోగాలు లేవని ఆత్మహత్య చేసుకున విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఘటన కారణంగానే ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Related posts