ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల ఏం చేసిన సంచలనంగానే మారుతుంది. అయితే ప్రస్తుతం ఆవిడ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.. మొదట్లో అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఆత్మీయ సమ్మేళనాలు అని తెలిపిన షర్మిల ఇప్పుడు క్రమంగా సమస్యలు, ప్రాజెక్టులపై కూడా స్పందిస్తున్నారు.. లోటస్ పాండ్‌లో ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆమె.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మహబూబ్‌నగర్ జిల్లా నేడు వలసల జిల్లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ఇక, 80 శాతం ప్రాజెక్టులు స్వర్గీయ వైఎస్ఆర్ హయాంలోనే పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను ఇంకా ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఒక్క జిల్లాలోనే 2 లక్షల మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులున్నారని వ్యాఖ్యానించారు వైఎస్ షర్మిల.. కోహినూర్ వజ్రం జన్మస్థలం ఈ జిల్లాయే.. కానీ, కరువు జిల్లా, వలసల జిల్లా అని ఆవేదన వ్యక్తం చేశారు.. నాన్న (వైఎస్ఆర్) అనేవారు.. తాను చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే.. దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి.. అప్పుడు వలసలు ఆగిపోతాయి అని పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
ఎస్సీ వర్గీకరణపై వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి: మంద కృష్ణ