telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

దర్శకుడికే టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు..

సైబర్ నేరగాళ్ల చేతిలో ఏమి తెలియని వాళ్లు మోసపాయారంటే అనుకోవచ్చ కానీ ఈ సారి సినీ దర్శకుడే వారి ట్రాప్‌లో చిక్కుకున్నారు. అతడు చేసింది రెండు సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ హోదాను అందుకున్నారు. అతడెవరో కాదండీ చలో, భీష్మ వంటి బ్లాక్ బస్టర్లను ఇండస్ట్రీకి అందించిన వెంకి కుడుముల. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. సైబర్ నేరగాళ్లు ఎంతో చాకచక్యంగా వెంకీకి మాయమాటలు చెప్పి నమ్మించి రూ.66వేల నొక్కేశారు. ఇంతకీ వాళ్లు ఏం చెప్పారని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నా.. వెంకీ తెరకెక్కించిన రెండో సినిమా భీష్మ. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు సినిమాలను ఎంపిక చేస్తున్నామని, అందులో భీష్మ కూడా ఎంపిక చేస్తామంటూ వెంకీకి చెప్పారు. అంతపెద్ద ఫ్లాట్ ఫార్మ్‌కి తన సినిమా వెళుతుందంటే ఏ దర్శకనిర్మాతలైనా చాలా గొప్పగా భావిస్తారు. వెంకీ కూడా అలానే అనుకున్నారు. అంతేకాకుండా భీష్మ సినిమా ఆరు కేటగిరీల్లో నామినేట్ చేస్తున్నామని, కేటగిరీకి రూ.11 వేల చొప్పున డిపాజిట్ చేయమని చెప్పారు. అసలే సంతోషంలో ఉన్న వెంకీ మొత్తం రూ.66వేలు వెంటనే చెల్లించారు. అంతటితో అయిపోలేదు. సైబర్ నేరగాడు మళ్లీ ఫోన్ చేసి మూడు కేటగిరీల్లో తప్పు జరిగిందని, మరి కొంత డబ్బు చెల్లించాలని అన్నాడు. దాంతో వెంకీకి అనుమానం రావడంతో నిర్మాతలు వద్దాన్నారని చెప్పి కాల్ కట్ చేశారు. ఆ తరువాత వెంటనే పోలీసులను ఆశ్రయించిన వెంకీ జరిగింది చెప్పి కేసును నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Related posts