telugu navyamedia
Uncategorized రాజకీయ వార్తలు

హర్యాన మాజీ సీఎం ఓం ప్రకాశ్ ఆస్తుల జప్తు!

Haryana Ex-CM omprakash ed rides

హర్యాన మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాకు చెందిన ఆస్తులను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఢిల్లీ, పంచకుల, సిర్సాలోని ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.3.68 కోట్లు ఉంటుందని ఈడీ తెలిపింది. చౌతాలాతోపాటు మరికొందరిపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈడీ స్వాధీనం చేసుకున్న వాటిలో ఫ్లాట్, స్థలం, ఇల్లు, వ్యవసాయ భూమి ఉన్నట్టు పేర్కొంది.

మనీలాండరింగ్ కేసులో చౌతాలాతోపాటు ఆయన కుమారులు అజయ్ చౌతాలా, అభయ్ చౌతాలాపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. 1993-2006 మధ్య చౌతాలా మొత్తం రూ.6.09 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కూడబెట్టినట్టు సీబీఐ దర్యాప్తులో స్పష్టమైంది.

Related posts